ఏపీలో నేడు స్కూళ్లు రీఓపెన్

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో వేసవి సెలవుల అనంతరం గురవారం నుంచి స్కూళ్ల పున:ప్రారంభం అయ్యాయి. వూసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీ ణ్ప్రకాష్ గతంలో చెప్పారు. ఈ క్రమంలో నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేసారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *