సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
కొత్తగూడెం మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, కాలేజ్ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, కాలేజీ ప్రిన్సిపల్ వారిపై చేస్తున్నటువంటి అసభ్య పదజాలాలపై చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో ప్రిన్సిపాల్ అటెండర్లు రాత్రులు రావడం ఆపాలంటూ నిన్నటి నుంచి నిరసన తెలియజేస్తున్న మెడికోలు నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ ను కలిసినా వారికి స్పష్టమైన హామీ రానందున, రెండవ రోజు కూడా కళాశాల ఎదుట నిరసన తెలియజేశారు..