ఆదిలాబాద్, సిరా న్యూస్
నేషనల్ గ్రీన్ కాప్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ‘ఆల్టర్నేటివ్స్ టు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ‘అనే అంశంపై నిర్వహించిన డ్రామాలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల చాందా(టి ) లో విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. డైట్ వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, ఎన్జీసీ కో ఆర్డినేటర్ కంటే నరసయ్య, సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్చే తుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్ రావు, ఉపాద్యాయ బృందం విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఇకముందు కూడా జిల్లా స్థాయిలో నిర్వహించే వివిధ విభాగాలలో పాల్గొని పాఠశాల పేరును జిల్లా స్థాయిలో నిలపాలని కోరారు