సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
గొప్ప ప్రజాకవి కాళోజి నారాయణరావు : కార్యదర్శి మహేందర్
గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందని పందిళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు దర్ముల రవి,దబ్బేట శ్రీకాంత్, కొత్తూరి రాజు, కీర్తి విజయ్, ఇల్లందుల ప్రశాంత్,వెల్ది వేణు, ఇల్లందుల రవీందర్, ఎండీ అన్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.