సిరాన్యూస్, చిగురుమామిడి
బొమ్మనపల్లి ఇన్చార్జి కార్యదర్శిగా ఎస్ స్వర్ణలత
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ ఇన్చార్జి కార్యదర్శిగా ఎస్ స్వర్ణలత గురువారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో కార్యదర్శిగా పనిచేసిన వైయ్ రమణారెడ్డి ఆమెకు పలు రికార్డులు అప్పగించారు. రమణారెడ్డి 31 నెలలపాటు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఇటీవల పదవి విరమణ పొందారు.ప్రస్తుతం ఆమె సీతారాంపుర్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అదనపు బాధ్యతల కింద బొమ్మనపల్లికి ఇన్చార్జిగా వచ్చారు.