ఆత్మకూరు టీడీపీ లో వర్గ ఘర్షణ

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం టిడిపిలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎన్నికల ప్రచారం వేల నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి కూటమిలో భగ్గుమన్న వర్గ విభేదాలు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ నాయుడు ఎదురు గా తెలుగు తమ్ముళ్లు… బాహా బాహికి దిగారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, చేజర్ల మండలం నాగలవెల్లటూరు గ్రామంలో పర్యటిస్తుండగా టిడిపికి చెందిన వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ,ఆనం రామనారాయణ రెడ్డి తో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారనికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్య నాయుడు పై గ్రామానికి చెందిన కొందరు దాడికి ప్రయత్నం చేసారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *