జిల్లా కలెక్టర్
సిరా న్యూస్,ఖమ్మం;
సెక్టార్ అధికారులు తమ విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సంఘ నియమ, నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలన్నారు. సెక్టార్ అధికారుల విధులు మూడు అంచెలుగా వుంటాయని, పోలింగ్ కు 72 గంటల ముందు, పోలింగ్ కు ఒక రోజు ముందు, పోలింగ్ రోజున విధులు కీలకమని అన్నారు. సెక్టార్ అధికారులు వల్నరబులిటి మ్యాపింగ్ చేయాలన్నారు. వల్నరబులిటి గ్రూప్స్, ఎవరు చేస్తున్నారు గుర్తించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేయాలన్నారు. గడచిన ఎన్నికల్లో 10 శాతం కంటే తక్కువ పోలింగ్, 90 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరిగి, ఒకే అభ్యర్థికి 75 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయిన పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ ప్రక్రియ ఆగిన కేంద్రాలు, ఏఎస్ డి జాబితా అసాధారణంగా ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వల్నరబుల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటుహక్కు వినియోగించుకొనేలా నమ్మకం కలిగించాలన్నారు. సెక్టార్ అధికారులు గత ఎన్నికల్లో పోలింగ్ శాతం, జెండర్ రేషియో చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో కనీస మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎంసిసి అతిక్రమణలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు, ఒక సెక్టార్ అధికారికి గరిష్టంగా 12 పోలింగ్ కేంద్రాల కేటాయింపు ఉంటుందని, సెక్టార్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల రూట్ మ్యాప్ పై పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. సి-విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం కల్పించి, పెద్దఎత్తున యువత తో యాప్ డౌన్లోడ్ చేయించాలన్నారు. 1950 కాల్ సెంటర్ పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. స్థానిక యువతతో సమావేశాలు ఏర్పాటుచేసి, వారికి అవగాహనతో పాటు చైతన్యం కల్పించాలన్నారు. ఇవిఎం ల రవాణా చాలా2జాగ్రత్తగా చేయాలన్నారు. ఇవిఎం ల రవాణాను జిపిఎస్ ఉన్న క్లోస్డ్ వాహనంలోను, ఎస్కార్ట్ తోపాటు చేపట్టాలన్నారు. సెక్టార్ అధికారులు హ్యాండ్ బుక్ ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పై అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, అప్రమత్తంగా వుంటూ, సమర్థవంతంగా నిర్వర్తించాలని అయన తెలిపారు.
==========================