సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో అనుమతులు లేకుండా దగ్గుమందు (కాఫ్ సిరప్) తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే ఫార్మా కంపెనీ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేసారు. కంపనీలో 65 వేల రూపాయల విలువైన 635 దగ్గుమందు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లిలో తయారు చేసి బెంగుళూరులోనీ గామి ఫార్మాస్యూటికల్ కంపనీ పేరుతో నిందితులు మార్కెటింగ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఉండే ఇటువంటి ఔషధాలు వినియోగించవద్దని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు.