ములుగు జిల్లా మల్లంపల్లిలో సెల్ఫీ సూసైడ్ యత్నం

 సిరా న్యూస్,ములుగు;
భార్యభర్తల గొడవలో తనను పెద్దమనుషులు కొట్టారనే మనస్తాపంతో రాజేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. భార్యభర్తల గొడవ కారణంగా భర్తకు దూరంగా భార్య వుంటోంది. తన ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకెళ్లేందుకు రాజేష్ ప్రయత్నించాడు. వారిని తీసుకెళ్తుండగా ముగ్గురు గ్రామస్తులు తనను కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసాడు. తన చావుకు ఆ ముగ్గురే కారణమని సెల్ఫీ వీడియో తీస్తూ గడ్డిమందు తాగాడు. పరిస్థితి విషమం గా వుండడంతో హాస్పిటల్ కు తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *