1857 సిపాయిల తిరుగుబాటు మొదలైంది ఈ రోజే

సిరా న్యూస్;

కలకత్తా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మధ్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు ఒక హిందూ సిపాయి. ఇందుకు కారణం బ్రిటిషు వారు సిపాయిలకు ఆవు కొవ్వు, పంది కొవ్వును పూసి తయారుచేసిన తూటాలు ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందూ ముస్లిం ఇద్దరికీ ఇవి నచ్చలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి. ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు . సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే. . అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే !భారత ప్రభుత్వం మంగళ్ పాండే గౌరవార్థం, 1984 అక్టోబరు 5 న ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *