సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక క్రాంతి నగర్ లో ఉన్న జీవన జ్యోతి అంధుల పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ సభ్యుడు శేగు నందకిషోర్ జన్మదినం సందర్భంగా నిత్యావసర కిట్లు, పరీక్షల వ్రాత కిట్లు నందకిషోర్ సౌజన్యంతో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి.వీ. సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు తమ జన్మ దినోత్సవాలు, వివాహ దినోత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. వేడుకలలో ఖర్చు చేయడం కన్నా అవసరం ఉన్నవారికి సహకారం అందించడం ద్వారా పదిమందికి మేలు జరుగుతుందని అన్నారు.*ఈ కార్యక్రమంలో నందకిషోర్ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి సుధాకర్ రెడ్డి తో పాటు కార్యదర్శి సోమేశుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చంద్రమోహన్, సభ్యులు మేడా చంద్రశేఖర్,మణి మోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ యువజన విభాగం సభ్యురాలు రూప శ్రీ, జీవన జ్యోతి అంధుల పాఠశాల నిర్వాహకులు వలి భాష తదితరులు పాల్గొన్నారు.