సిరా న్యూస్;
2023- 2024 సంవత్సరాలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పథకం, సేవ పథకాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, చేతుల మీదుగా అందజేసి అభినందించారు డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ అంకితభావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. క్రమశిక్షణతో పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. సేవా పథకాలు అందుకున్న వారి వివరాలు.. వై కృష్ణారెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఉత్తమ సేవా పథకం,
ఏ, హనుమంత రెడ్డి, ఎస్బి ఎఎస్ఐ, సేవా పథకం,
యు, నాగేశ్వరరావు, ఏఎస్ఐ ములుగు, సేవా పథకం
ఎన్, తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ త్రీ టౌన్, సేవా పథకం,
ఎన్, వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్,
సేవా పథకం
ఈ కార్యక్రమంలోఅడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాజేష్, పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.