సిరా న్యూస్,పిడుగురాళ్ల;
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని నాగుల గుడి దేవాలయ నుండి ప్రారంభమైన సుబ్రమణ్య స్వామి పల్లకి సేవ పిడుగురాళ్ల పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది.ఈ కార్యక్రమంలో నాగుల గుడి దేవస్థానం కమిటీ యువత అధిక సంఖ్యలో పల్లకి సేవ మోస్తూ హరోం హర అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లకిని మోస్తూ ముందుకు కదిలారు.
మహిళ భక్తులు కూడా కావాడి మోస్తూ తమ భక్తుని చాటుకున్నారు. ఈ పల్లకి సేవ దేవస్థాన కమిటీ అధ్యక్షులు గుదే సతీష్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.