సిరా న్యూస్, బేల:
సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి..
ఈనెల 15 న సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బిజెపి గిరిజన మోర్చ బేల మండల అధ్యక్షుడు రాథోడ్ దినేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యావత్ గిరిజన జాతిని ఏకం చేసి, గిరిజనుల ఆరాధ్య దైవంగా పేరొందిన సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని అన్నారు. గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు సేవలాల్ మహారాజ్ అని అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి వీలుగా ప్రభుత్వం వెంటనే గురువారం సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు.