సిరా న్యూస్,కొవ్వూరు;
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార దేవం జడ్పీ హైస్కూల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. అల్లరి చేస్తున్నాడు అంటూ ఏడవ తరగతి విద్యార్థిపై టీచర్ దాష్టికం ప్రదర్శించింది. దీంతో విద్యార్థి అపస్మారకస్థితికి వెళ్లడంతోపాఠశాలలోవివాదాస్పదం అయింది.కొవ్వూరు మండలం కుమారదేవం జడ్పీ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి పై సోషల్ టీచర్ అయినాల వెంకటలక్ష్మి అల్లరి చేస్తున్నాడంటూ తన దగ్గర ఉన్న ఫైబర్ ప్లాస్టిక్ స్కేలుతో గుండెలపై కొట్టడంతో కింద పడిపోయిన విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగుతిన్న ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయుడిని ఆస్పత్రి తరలించమని సలహా ఇవ్వడంతో ఆయన హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానోపాధ్యాయురాలు వెంటనే విద్యార్థిని పాఠశాలకు తీసుకురావాల్సిందిగా ఆదేశించడంతో ఉపాధ్యాయుడు తిరిగి చికిత్స చేయించకుండానే పాఠశాలకు తరలించారు. అనంతరంపాఠశాల ప్రాథమిక చికిత్స చేయించిన ఉపాధ్యాయులు విద్యార్థిని ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పి తనకుగుండెల్లో నొప్పి వస్తుందనిచెప్పడంతో తల్లిదండ్రులు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అపస్మారక స్థితిలోకి చేరిన తమ కుమారుడిని పరిస్థితి తమకు తెలియజేయకుండా ఉండడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన తల్లిదండ్రులు బాధ్యురాలైన వెంకటలక్ష్మి పై చర్యలు తీసుకోవాలంటూ కొవ్వూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు…