ఫోక్సో కేసు నమోదు
సిరా న్యూస్,మేడ్చల్;
జగద్గిరిగుట్ట పోలిస్ స్టేషన్ పరిధిలో 13 యేండ్ల మైనర్ బాలిక పై పలుమార్లు అత్యాచారానికి సిద్దు అనే వ్యక్తి పాల్పడ్డాడు. బాలిక తల్లి భర్త నుంచి వేరుగా ఉంటోది. ఆమెకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆసరాగా చేసుకుని ఆమెను వ్యభిచార వృత్తి పై సిద్దు మళ్ళించాడు. దసరా పండుగ రోజు తల్లి దగ్గరికి వచ్చిన బాధితురాలు (13) ఇంటిలో ఒంటరిగా ఉండగా ఆమెపై సిద్దు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించి అప్పటినుంచి పలుమార్లు బాలికపై అఘాయిత్యం కొనసాగించాడు. సిద్దు వేదింపులు తాళలేక బాలి తల్లికి చెప్పింది. పోలీసులు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.