ఆత్మహత్యయత్నం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సునీత
సిరా న్యూస్,కరప;
పెనుగుదురు ఫీల్డ్ అసిస్టెంట్ పూలపకుర సునీత పై జనసైనికులు వేధింపులు ఎక్కువవ్వడం తో భరించలేక తెల్లవారుజామున నిద్రమాత్రలు, టైల్స్ లోకి వాడే గమ్ ను కలుపుకుని త్రాగింది. దాంతో కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెకు చికిత్స ను అందిస్తున్నారు.ఆమె పరిస్థితి విషమంగా ఉంది.వివరాల్లోకి వెళితే.. ఎనర్జీఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వరిస్తున్న పూలపకూర సునీత ను కరప మండలానికి చెందిన జనసేన నాయకులు బండారు మురళి,నానీబాబు, భవానీ లు ఉపాధి హామీ లో దొంగ మస్తార్లు వేసి నెలకు రూ. 20వేలు ఇవ్వాలని గత మూడు నెలలుగా వేదిస్తున్నారని, బండారు మురళి తనతో సన్నిహిత్యం గా ఉండాలని, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నం చేసినట్లు, నానీబాబు అను వ్యక్తి కులదుషన చేస్తూ మనసునొచ్చుకునే విధంగా మాట్లాడుచున్నాడని, తన భార్య ఆత్మహత్యయత్ననికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భర్త వీరబాబు తెలిపారు.