Shailender Wagmare: బీజేపీలో చేరిన మాజీ కౌన్సిలర్ శైలెందర్ వాగ్మారె

సిరాన్యూస్‌, బేల‌
బీజేపీలో చేరిన మాజీ కౌన్సిలర్ శైలెందర్ వాగ్మారె

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గురువారం మాజీ కౌన్సిలర్ శైలెందర్ వాగ్మారె ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలెందర్ మాట్లాడుతూ తాను విద్యార్థి దశనుండే రాజకీయాలలో ఉంటూ ప్రజలకి సేవ చేశానని, ఇకమీదట కూడా ప్రజల్లో ఉంటూ సేవచేస్తానని అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యమని, దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమని తెలిపారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవ‌డానికి తాను అహర్నిశలు కృషి చేస్తానని, కమలం పువ్వు గుర్తుకే ఓటువేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. కార్యక్రమంలో గుడిహత్నూర్ జడ్పీటీసీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, పార్లమెంట్ కో కన్వీనర్ మయుర్ జకాతే, తాంసీ జడ్పీటీసీ రాజు, మండల అధ్యక్షులు శివ, ఎంపీటీసీ కొవ తులసి, ఉష్కేమ్ రఘుపతి, వైస్ ఎంపీపీ నాగర్గోజే భరత్, జిల్లా అధికార ప్రతినిధి కేంద్రే లక్ష్మిన్, ముండే సుధాకర్, జగన్, గణేష్ భోసారే తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *