సిరా న్యూస్, ఓదెల
ఓదెల లో కోర్టు మంజూరు
హైకోర్ట్ న్యాయవాది పొలాస శంకర్
ఓదెల మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్ట్ న్యాయవాది పొలాస శంకర్ గత కొంత కాలంగా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, న్యాయశాఖ మంత్రిని , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిజిష్టర్ జనరల్, న్యాయశాఖ కార్యదర్శి కి అనేక పర్యాయాలు విన్నవించారు.ఈసందర్భంలో ఓదెలలో కోర్టు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన గత న్యాయశాఖ మంత్రి కోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని న్యాయశాఖ కార్యదర్శి కి చెప్పారు. ఈ సందర్భంలో ఓదెలకు నూతన కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని, నూతన కోర్టు ఏర్పాటుకు జీఓ ఇచ్చిందని హైకోర్ట్ న్యాయవాది పొలాస శంకర్ తెలిపారు, ఈ యొక్క కోర్టు ఏర్పాటు వలన కేసులు సత్వరమే పరిష్కారం జరిగి ఇక్కడి ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఓదెలలో కోర్టు మంజూరు కోసం ఎన్నో రోజులుగా కష్టపడ్డామని హైకోర్టు న్యాయవాది పొలాస శంకర్ తెలిపారు. ఓదెల మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పౌలాస శంకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.