Shankar: వేసవిలో తాగు నీటి సమస్యలు రాకుండా చూడాలి

సిరాన్యూస్‌, బేల‌
వేసవిలో తాగు నీటి సమస్యలు రాకుండా చూడాలి
* స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్

వేసవిలో తాగు నీటి సమస్యలు రాకుండా చూడాలని స్పెషల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ , ఆర్డబ్ల్యూఎస్ శాంతి కుమార్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శుతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవికాలంలో గ్రామాలలో ఎటువంటి తాగునీటి ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ఎస్ డి ఎఫ్ నుండి 26 లక్షలు, ఓఎన్ఎమ్ ,9 లక్షల రూపాయలు పని వచ్చిందని అన్నారు. ఏ గ్రామాల్లో తాగునీటి కొరత ఉందో ఆ గ్రామాల్లో ఎక్కువగా ప్రధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శిలకు అప్పగించామని అన్నారు.ఈ స‌మావేశంలో ఎంపీడీవో మహేందర్, ఎం పి ఓ మహేష్, గ్రామ కార్యదర్శులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *