సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా గడపగడపకు ప్రచారం: వార్డు ఇంచార్జ్ శౌకత్ పాషా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీ 8వ వార్డులో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు గ్యారంటీ కార్డుల పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వార్డు ఇంచార్జ్ శౌకత్ పాషా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సహాయ సహకారాలతో ఖానాపూర్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా ఆత్రం సుగుణ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏ రవి, బొప్పారపు శ్రీనివాస్ అమేర్, అనాస్, చిన్ను,రహన్ ఖాన్, రాజేందర్ , తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.