సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళల భద్రతే షీ టీం లక్ష్యం
మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని షీటీం సభ్యులు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడ హై స్కూల్ ను షీటీం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా షీటీం సభ్యులు మహిళల భద్రత, సైబర్ క్రెం, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు. మహిళలు, విద్యార్థినులు ఈవ్‌టీజింగ్‌కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని, ప్రతీ మహిళా, విద్యార్థినులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తే షీటీం నంబరు 8712659953కు కాల్ చేయాలన్నారు. అనంతరం చైల్డ్ మేనేజర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు సుశీల సత్య మోహన్, హెచ్ఎం నారాయణ , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.