సిరా న్యూస్, కుందుర్పి
శివ దీక్షాపరుల భిక్షాటన.. ఆహ్వాన పత్రికలను పంపిణీ
శివ దీక్షపరులు శుక్రవారం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేస్తూ శివపార్వతుల ఊరేగింపు ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. ఈనెల 24వ తేదీన మాఘ పౌర్ణమి సందర్భంగా శివదీక్షపరులు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం రాత్రి వేళలో జరుగుతుంది. అలాగే ఉదయం 6 గంటలకు గణపతి కమల మల్లేశ్వర స్వామికి అభిషేకం కుంకుమార్చన, 11 గంటలకు భజన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల వీరభద్ర స్వాముల, కన్య స్వాములతో కలిసి పూజ కార్యక్రమాలు ఉంటాయి.