సిరాన్యూస్, గుడిహత్నూర్
భక్తులతో కిటకిటలాడిన శివాలయం
మహా శివరాతి సంధర్బంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లోని శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఒక్కే ఒక్క శివాలయం ఉండడంతో ఉదయం నుంచి శివ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ నెలకొంది. భక్తులు ఉపవసం ఉన్న వారికి ఫలాలు అందించారు.