రెచ్చిపోయిన శివానీ… Shivani is upset…

సిరా న్యూస్,హైదరాబాద్;
కథానాయికలుగా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన స్టార్ కిడ్స్ గ్లామరస్ రోల్స్ చేయడానికి ‘యస్’ అంటారా? ‘నో’ అంటారా? అని దర్శక నిర్మాతలలోనూ, ప్రేక్షకులలోనూ చిన్నపాటి సందేహాలు ఉండటం సహజం. అయితే… క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని ‘విద్యా వాసుల అహం’తో చెప్పారని అనుకోవచ్చు.యువ కథానాయకుడు రాహుల్ విజయ్ సరసన శివాని రాజశేఖర్నటించిన సినిమా ‘విద్య వాసుల అహం’. ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ… అనేది ఉపశీర్షిక. లేటెస్టుగా సినిమా టీజర్ విడుదల చేశారు. సీన్స్ లెంగ్త్ తక్కువ అయినప్పటికీ… అందులో ముద్దు సీన్లు, షవర్ బాత్ సీన్ హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.’విద్యా వాసుల అహం’ సినిమాలో విద్య పాత్రలో శివానీ రాజశేఖర్, వాసు పాత్రలో రాహుల్ విజయ్ నటించారు. కొత్తగా పెళ్ళైన యువతీ యువకుల మధ్య ఏం జరిగింది? ఇద్దరూ ఇగోలకు పోతే ఏం అవుతుంది? అనే కథతో సినిమా తీశారని అర్థం అవుతోంది. కొత్త జంట అంటే ముద్దు ముచ్చట, ఆ మురిపాలు, రొమాన్స్ కామన్ కదా! అందులో భాగంగా ‘విద్యా వాసుల అహం’లో శివానీ రాజశేఖర్ రొమాంటిక్ సీన్స్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా షవర్ బాత్ సీన్ చాలా మందిని అట్ట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమెను గ్లామరస్ రోల్స్ విషయంలో ఆమెను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అయితే… శివానీ గానీ, ఆమె చెల్లులు శివాత్మిక గానీ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ టీజర్ షేర్ చేయలేదు. ఎందుకో మరి? విడుదల ఆలస్యం కావడం కారణమా? లేదంటే టీజర్ లో ఉన్న సన్నివేశాలా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రెండో చిత్రమిది. ఇంతకు ముందు ‘కోట బొమ్మాళీ పీఎస్’ సినిమా చేశారు. ‘పంచతంత్రం’ సినిమాలో శివాని చెల్లెలు శివాత్మికతో రాహుల్ విజయ్ నటించారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు అని సమాచారం.నిజం చెప్పాలంటే… ఈ ఏడాది సంక్రాంతికి ‘విద్యా వాసుల అహం’ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే… అప్పట్లో కుదరలేదు. ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. బహుశా… ఈ నెల 29న విడుదల చేస్తారేమో చూడాలి. ‘విద్యా వాసుల అహం’ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకుడు. ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా సినిమా రూపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *