సిరాన్యూస్, ఓదెల
నేత్రదాతకు సంస్మరణ సభ
హాజరైన సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్
ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బైరి శ్రీనివాస్ సంస్మరణ సభను బుధవారం సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసభకు అతిథులుగా సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ హాజరయ్యారు. అనంతరం కుమారులు వినోద్, సాయినాథ్ ,భార్య రజిత లకు జ్ఞాపికను అందజేసి ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన కుటుంబ సభ్యులకు నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మేరుగు సారంగం,క్యాతం వెంకటేశ్వర్లు , పృథ్విరాజ్, డాక్టర్ కోండ్ర వేణు, ఓదెల గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం మల్లేశం ,అల్లం సతీష్, క్యాతం రాజేంద్రప్రసాద్ , భారత్ గ్యాస్ క్యాతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.