సిరా న్యూస్,విజయవాడ;
టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేం దుకు ఏర్పాట్లు చకచకా జరుగుతు న్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీ పీ-జనసేన-బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రమాణస్వీ కారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వ హించనున్నారు.టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు ప్రమాణ స్వీకార సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా, చంద్ర బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధా ని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్య మంత్రులు వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.టీడీపీ నేతలు తొలుత మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికీ… అది అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు.
=========