సిరా న్యూస్, హుస్నాబాద్
కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర ముఖ్య నేతలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.