సిరాన్యూస్, ఓదెల
తాటి చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడి శ్రీనివాస్ గౌడ్‌కు గాయాలు
తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలైన సంఘటన పెద్దపల్లి మండలం రాగినేడులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్ గౌడ్ (51)సోమవారం సాయంత్రం వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. ఒక చేయి విరగడం, తీవ్ర గాయాలు అయినట్లు కల్లుగీత కార్మికులు, కుటుంబ సభ్యులు తెలిపారు.