సిరాన్యూస్, ఓదెల
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్
ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలు 143, 144, 145, 146 కేంద్రాలను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన మహిళల చేతిలో ఉన్న ఓటర్ చిట్టీలను పరిశీలించారు.ఎన్నికలు సక్రమంగా జరగాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వీరి వెంట ఓదెల తహసీల్దార్ యాకన్న, పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి రాజేందర్, కొలనూ ర్ గ్రామ కార్యదర్శి మహేందర్ తదితరులు ఉన్నారు.