సిరాన్యూస్, ఓదెల
భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు: అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఓదెల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వివిధ సమస్యలపై దరఖాస్తుల సమర్పించేందుకు వచ్చిన రైతులతో అదనపు కలెక్టర్ మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం కింద అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సమావేశంలో ఓదెల మండల తహసిల్దార్ యాకన్న , నాయబ్ తహసిల్దార్ అనిల్ కుమార్ , ఎంపిఎస్ఓ మల్లేశ్, గిర్దావర్ రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.