SI Ashok Reddy:ప్రజల రక్షణ పోలీస్ ల బాధ్యత : ఎస్సై అశోక్ రెడ్డి

సిరాన్యూస్‌, ఓదెల
ప్రజల రక్షణ పోలీస్ ల బాధ్యత : ఎస్సై అశోక్ రెడ్డి
* ఓదెల‌లో కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం

ప్రజల రక్షణ పోలీస్ ల బాధ్యత అని ఎస్సై అశోక్ రెడ్డి అన్నారు. బుధ‌వారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండల కేంద్రంలో రామాలయం దగ్గర బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఎస్సై జి. అశోక్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.ఈ సందర్భంగా ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామంలో కాలనీ లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాల‌న్నారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. మరింత స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను అమర్చుకోవాలని తెలిపారు. ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రాజేందర్ , రాజు, అశోక్ , రామకృష్ణ, శంకర్ , గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *