సిరాన్యూస్, చిగురుమామిడి
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై బి. రాజేష్
వినాయక చవితి వేడుకలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చిగురుమామిడి ఎస్ఐ బి రాజేష్ తెలిపారు. మంగళవారం చిగురుమామిడి పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసని విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడారు. మండలంలో చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, మండపాలను ఏర్పాటు చేసే నిర్వహకులు కమిటీ వివరాలను అప్లికేషన్ ఫామ్ నింపి పోలీస్‌స్టేషన్‌లో తెలియజేయాలన్నారు. అప్లై చేయని వారికి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు. అప్లికేషన్లలో సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా మండపాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఒక డ్రమ్ లో నీరును,2 బకెట్లలో ఇసుక నింపి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగే విధంగా డీజేలు వాడరాదన్నారు. మండపంలో ఒకటే స్పీకర్ బాక్స్ ను మాత్రమే పెట్టాలని, దానిలో భక్తి గీతాలను ప్లే చేయాలన్నారు. విద్యాలయాలకు, ఆసు పత్రులకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా స్పీకర్ బాక్స్ లను వినియోగించు కోవాలన్నారు.