సిరా న్యూస్, చిగురుమామిడి
కిడ్నాప్ వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు
*ఎలాంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదు.
*ప్రజల భద్రతే ద్యేయంగా పనిచేస్తాం.
*ఎస్సై బండి రాజేష్
కిడ్నాప్ వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్ హెచ్చరించారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని..ఇలాంటి వాటిని ఉపేక్షించబోమనీ హెచ్చరించారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం,తప్పుడు పోస్టు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.చిగురుమామిడి మండలంలో ఏలాంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని తెలిపారు.ప్రజలు ఇలాంటి పుకార్లు నమ్మవద్దని చెప్పారు. అనుమానతలు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ నంబర్ : 91 87126 70772.గాని, 100కు సమాచారం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. ప్రజల భద్రతే ద్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.