సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
దొంగలించిన ట్రాక్టర్ పట్టివేత
* నిందితుడు అరెస్ట్.. రిమా్ండ్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం రాత్రి మహేందర్ ట్రాక్టర్ పని ముగించుకుని అతని ఇంటి వెనకాల పార్క్ చేసి పెట్టారు. అదే రాత్రి సమయంలో ట్రాక్టర్ ను గాంధీనగర్ నుండి దొంగలించారు. విషయంపై ట్రాక్టర్ యజామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగిన జగిత్యాల జిల్లా శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన వెరేటి రవి సంగంను పట్టుకున్నారు. కడెం మండలంలో దాచి ఉంచిన ట్రాక్టర్ల రికవరీ చేసి రవిని అరెస్ట్ చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ లింబాద్రి, మహేష్ భీమేష్ కానిస్టేబుల్ లను సిఐ సైదారావు అభినందించారు.