సిరాన్యూస్, ఇచ్చోడ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ నరేష్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని ,కరెంటు స్థంభాలు, ట్రాన్సాపార్మర్స్, ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా ఆపదలా ఉంటే వెంటనే డయల్ 100, లేదా సీఐ. 8712659936, ఎస్సై. 8712659944 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.