సిరాన్యూస్, బేల
యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్సై రాధిక
యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎస్సై రాధిక అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఎస్సై రాధిక మాట్లాడుతూ ప్రతిరోజు యోగ చేయడం వలన అనారోగ్యం సమస్యలు దూరం కావటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా రేయింబవళ్లు 24 గంటలు విధులను నిర్వహిస్తుంటారని, యోగాతో మానసిక ప్రశాంతతం కలుగుతుందని చెప్పారు. అనంతరం పోలీస్ కార్యాలయ సిబ్బందిని కొన్ని ఆసనాలు . సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, బాలాసనం, బట్టర్ ఫ్లై, విక్రషణ, మరిన్ని ఆసనాలు చేయించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ జీవన్ , కానిస్టేబుల్ సలీమ్ పాల్గొన్నారు.