సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్ న్ను ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారినందరినీ హుటాహుటిన బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. జెే. సి సుబ్బారావు వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జే. సి మీడియాతో మాట్లాడుతూ ఆ విద్యార్థులంతా అమాయకంగా రకరకాల మిశ్రమాలతో జ్యూస్ చేసుకుని తాగి అస్వస్థతకు గురయ్యారన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన చెప్పారు.