సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఒక ఇంటిలో కొంతమంది కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కలిసి వెళ్లి రైడ్ చేసి 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 15,580 రూపాయలు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షెడమ్ శ్రీధర్ రెడ్డి, గాదగోని వెంకటేష్, కడతల మైసారెడ్డి, పల్లె సురేందర్ గౌడ్, అల్లాడి విశ్వనాథం, తడకమడ్ల గంగా ప్రసాద్, కెమ్మసారం మహేష్ ,పుల్లూరి రామాచారి, బత్తుల వెంకట్ రెడ్డి, కట్కూరి శ్రీనివాస్, ముక్కిస రాజిరెడ్డి, అందరూ సం సిద్దిపేట పట్టణం శ్రీనగర్ కాలనీ, టెలికం నగర్, భారత్ నగర్, హరిప్రియ నగర్ కు చెందిన వారు
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ. గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.