సిరాన్యూస్,బోథ్
అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి: సిరా దేవేందర్
అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి బూత్ ఐసిడిఎస్ కార్యాలయం లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తల సమస్యలను ఈనెల 24 వరకు పరిష్కరించకపోతే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం మోపుతున్నారు తప్ప ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి సరైన న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. సమ్మె కాలం యొక్క వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.