సిరాన్యూస్, ఇచ్చోడ
సిరా న్యూస్ ఎఫెక్ట్
* కథనానికి స్పందించిన రెవెన్యూ యంత్రాంగం
* ఇటుక బట్టీల పరిశీలన
అక్రమ ఇటుక బట్టిలు.. అనే కథనాన్ని బుధవారం సిరా న్యూస్ ప్రచురితం చేసింది.ఈ వార్త కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. మండలంలోని సిరిచెల్మ గ్రామంలో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న మండల తహసిల్దార్ తుకారాం, నయాబ్ తహసిల్దార్ జాదవ్ రామారావుతో కలిసి గ్రామానికి వెళ్లారు. అక్కడ అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలను పరిశీలించారు. చరవాణిలో నయాబ్ తహసిల్దార్ జాదవ్ రామారావును వివరణ కోరగా.. ఇటుక బట్టీలకు ఎలాంటి అనుమతులు లేవని , అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రెవిన్యూ తహసిల్దార్ హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.