సిరాన్యూస్, ఇచ్చోడ
‘సిరాన్యూస్’ ఎఫెక్ట్…
స్పందించిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు
*మొరం తవ్వకాలను ఘటన స్థలం పరిశీలన
దర్జాగా .. అక్రమ మొరం దందా …జోరుగా మట్టి.. మొరం తవ్వకాలు .. అనే కథనాన్నిసిరాన్యూస్ శనివారం ప్రచురితమైంది. వెంటనే సిరా న్యూస్ కథనానికి రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు స్పందించారు. మండలంలోని దాబా (బి) గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న స్థలానికి వెళ్లి పరిశీలించారు. మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఒకవేళ ఎవరైనా అక్రమంగా మొరంను తరలిస్తే అక్రమార్కుల పై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.