సిరా న్యూస్, బేల
సిర్సన్నలో బదిలీ వెళుతున్న ఉపాధ్యాయులకు సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో పదోన్నతి, బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు, కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు, వీడీసీ సభ్యులు , ఉపాధ్యాయులు కలిసి వారిని సన్మానించారు.సుధీర్ఘ కాలంగా పాఠశాలలో పనిచేసిన అజయ్, రమ, దర్మాదాస్, రేణుక విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు వారు చేసిన కృషిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు మహాలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వనమాల, మాజీ సర్పంచ్ గోదూరి భూమన్న, ఎంపిటిసి మాజీ సభ్యుడు నగేష్ రెడ్డి, ఎన్ ఎం సి మాజీ సభ్యుడు దీపక్ గౌడ్, విడిసి చైర్మన్ కే కృష్ణారెడ్డి, సభ్యులు, గ్రామస్తులు కిష్టారెడ్డి, భూమారెడ్డి, రూపేష్, నరేందర్, సీనియర్ ఉపాధ్యాయులు సరోజ , దేవి తదితరులు పాల్గొన్నారు.