సిరా న్యూస్,సిద్దిపేట;
కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం రాత్రి స్థానిక ఎస్ఐ భార్య ఆందోళనకు దిగింది. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనను దూరం పెడుతున్నాడని భార్య మానస ఆరోపణ. ఇద్దరి పిల్లల్ని దూరంగా ఉంచి తాను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారని అంటోంది. వేరోక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఆరోపించింది. తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకి దిగింది.
==========