సిరా న్యూస్,పెంబి
త్వరలో బ్రిడ్జిని నిర్మిస్తాం
* పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
* పసుపుల బ్రిడ్జ్ ను పరిశీలన
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పసుపుల బ్రిడ్జ్ గత ఏడాది వర్ష కాలంలో కొట్టుకొని పోయింది. శనివారం పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడి త్వరలో బ్రిడ్జ్ ను నిర్మిస్తామని చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సల్ల స్వప్నిల్ రెడ్డి, తులాల శంకర్ గుగ్గిళ్ల భూమేష్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, పుప్పాల శంకర్,దేవేందర్ రెడ్డి, అశోక్ రావ్, స్వామి, మహేందర్, రమేష్, దయానంద్, షబ్బీర్ పాషా, శ్రీనివాస్,తానాజీ, టికజీ, తదితరులు ఉన్నారు.