సిరా న్యూస్, ఆదిలాబాద్
బీజేపీ , బీఆర్ఎస్ లకు బిగ్ షాక్
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ కౌన్సిలర్లు
మంత్రి సీతక్క సమక్షంలో చేరిన శ్రీలేఖ ఆదివాసి
అన్ని పార్టీల చూపు కాంగ్రెస్ పైనే : మంత్రి సీతక్క
రాష్ట్రంలో అన్ని పార్టీల చూపు కాంగ్రెస్ పైనే ఉందని ఎలక్షన్ నాటికి పార్టీ ఎన్నడూ లేనంత శక్తి వంతంగా తయారై విజయ పథంలో దూసుకు పోతుందని మంత్రి సీతక్క అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్ , బోథ్ అసెంబ్లీ ఇంఛార్జీలు కంది శ్రీనివాస రెడ్డి , ఆడె గజేందర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఏజెంట్ల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నుండి పలువురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు. బీఆర్ ఎస్ నుండి 3 వ వార్డు కౌన్సిలర్ సాయి ప్రణయ్ , మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, 7 వ వార్డు కౌన్సిలర్ అంజు పారిక్ రావు, 3 వ వార్డు నుండి శంకర్, 35 వ వార్డు ప్రెసిడెంట్ అతిక్ ఉర్ రెహమాన్, మాజీ కౌన్సిలర్ ఖలీల్ , ఆనంద్ ,ఆకాష్ ,అజయ్, మాధస్తూ మహేందర్, కావటి మోహన్ ,సూరజ్ సోన్కాంబ్లె, రఘునాథ్ ఆడే ,అనుదీప్, అలాగే బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన డి. శ్రీలేఖ ఆదివాసి తన భర్త ప్రశాంత్ తో కలిసి కాంగ్రెస్ లో చేరారు. సుజయ్, బాలాజీ, సందీప్, రాథోడ్ సురేందర్, జాదవ్ తరుణ్, నారాయణ, నవీన్ జాదవ్, సంతోష్,శ్రావణ్,మహేందర్, శ్రీకాంత్, దీపక్ పలువురు బీజేపీ పార్టీ నుండి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి మంత్రి సీతక్క కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ , బోథ్ నియోజక వర్గాల ఇంఛార్జిలు కంది శ్రీనివాస రెడ్డి , ఆడె గజేందర్, అనిల్ ,బూత్ ఏజెంట్లు , కోఆర్డినేటర్లకు శిక్షణ నిచ్చేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన పార్టీ ప్రముఖులు , జిల్లా ముఖ్యనాయకులు ఆదిలాబాద్ ,బోథ్ , ఖానాపూర్ నియోజక వర్గాల బూత్ ఏజెంట్లు , కో-ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.