సిరా న్యూస్,రంగారెడ్డి;
హయత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారిపై స్కోడా కార్ పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరూ స్వల్ప గాయలతో బయటపడ్డారు.హైదరాబాద్ కే బి హెచ్ పి నుండి ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటకు వెళుతుండగా హయత్ నగర్ లక్ష్మ్మ రెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతుండగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తీసిన గుంత వద్ద కారు పల్టీ కొట్టింది.జాతీయ రహదారి పనుల వద్ద ఎలాంటి సైన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఇది రెండవ ఘటన జరిగింది. రోడ్డు మరియు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తుండగా అక్కడ ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడంతో కారు అదుపు తప్పు పల్టీ కొట్టిందని బాధితులు తెలిపారు.పనులు జరిగే దగ్గర ఎటువంటి సైన్ బోర్డ్స్ పెట్టని కాంట్రాక్టర్ పై కట్టిన చర్యలు తీసుకోవాలని తాము కూడా కాంట్రాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.