సిరా న్యూస్;
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి ఊహించిన దానికంటే అత్యధికంగా దూసుకెళ్తోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రెండు రెట్లు పెరగడం విశేషం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.4 శాతానికి చేరుకుందని గురువారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.3 శాతం కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అంచనా వేసిన 6.5 శాతం కంటే అధికం. ఇదే సమయంలో మొదటి, రెండో త్రైమాసికలకు సంబంధించిన గణాంకాలను కూడా ఎన్ఎస్ఓ సవరించింది. ఇంతకుముందు మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండగా 8.2 శాతానికి సవరించింది. అలాగే రెండో త్రైమాసికానికి వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 8.1 శాతానికి పెంచింది2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కూడా ఎన్ఎస్ఓ వృద్ధి అంచనాను 7 శాతం నుండి 7.6 శాతానికి సవరించింది. తయారీ రంగం నెమ్మదించడం, బలహీనమైన వినియోగం కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి మందగిస్తుందని పలువురు ఆర్థికవేత్తలు రాయిటర్స్ పోల్‌లో భావించారు. అయితే, అందుకు భిన్నంగా వృద్ధి రేటు పుంజుకోవడం గమనార్హం. సమీక్షించిన కాలంలో తయారీ రంగం 11.6 శాతం, నిర్మాణ రంగం 10.7 శాతం, వ్యవసాయ రంగం 3.8 శాతం వృద్ధి చెందాయి. మైనింగ్ రంగ వృద్ధి 7.5 శాతం, విద్యుత్, ఇతర యుటిలిటీల వృద్ధి 9 శాతంతో జీడీపీ పెరుగుదలకు దోహదపడ్డాయి. ప్రధాన రంగాల్లో వృద్ధి పెరగడమే జీడీపీ పుంజుకునేందుకు ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది.మరోవైపు, భారత ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన జనవరి నెలకు సంబంధించి 15 నెలల కనిష్టంతో 3.6 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అంతకుముందు డిసెంబర్‌లో ఇది 4.9 శాతం పెరిగింది. ప్రధానంగా బొగ్గు, ఉక్కు, సిమెంట్, సహజ వాయువు, విద్యుత్, ముడి చమురు రంగాల్లో ఉత్పత్తి సానుకూలంగా నమోదైంది.వృద్ధి రేటు వేగంగా పెరగడానికి కారణం స్పష్టంగా బేస్ ప్రభావం. అటువంటి పరిస్థితిలో, దీనిలో స్పష్టత కోసం మనం త్రైమాసిక ప్రాతిపదికన GDP ని చూడవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇది త్రైమాసిక ప్రాతిపదికన మెరుగుపడటం మంచి విషయం అని వారు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం GVA రూ. 30.1 లక్షల కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 18.8% పెరుగుదల. కానీ రెండు ఆర్థిక సంవత్సరాల కంటే 22.4% తక్కువ. GVA ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఉత్పత్తి .. ఆదాయాన్ని చూపుతుంది. ఇన్‌పుట్ ఖర్చు…ముడి పదార్థాల ధరను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇచ్చిన వ్యవధిలో ఎన్ని రూపాయల విలువైన వస్తువులు.. సేవలు ఉత్పత్తి జరిగిందో ఇది తెలియజేస్తుంది.వృద్ధి గణాంకాలు అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ అవి కొంతమంది ఆర్థిక నిపుణులను నిరాశపరిచాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్ సీనియర్ ఎకనామిస్ట్ ఉపాసన భరద్వాజ్ తన అంచనా 21.7%కంటే తక్కువగా ఉందని చెప్పారు. అయితే, DBS బ్యాంక్, సింగపూర్ ఆధారిత ఆర్థికవేత్త రాధికారావు వంటి నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం వృద్ధి రేటు ఉందని ఆయన అన్నారు. కోటక్ బ్యాంక్ భరద్వాజ్ జూలై నుండి ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం ప్రారంభించాయని, ఇప్పుడు అది వేగం పుంజుకుందని చెప్పారు. టీకాలు వేసుకుంటే ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం కాగలవని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రాలు లోటు తీర్చేందుకు రూ 1.5 లక్షల కోట్లు ఋణం ఉంటుంది అని చెప్పింది.అంటే ఆదాయ సేకరణ వ్యయం కంటే తక్కువగా ఉండవచ్చు, కాబట్టి ఒక నెలలో లక్ష రూపాయల కంటే ఎక్కువ సేకరణ జరిగిందని చెబితే, అది మంచి విషయం. అప్పుడు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితిలో, అత్యుత్తమ డేటా ఆర్థిక రంగం నుండి వస్తుంది. ఇది మరింత విశ్వసనీయమైనది. కంపెనీలు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయో లేదో బ్యాంక్ రుణాలు సూచిస్తాయి. అయితే, వర్కింగ్ క్యాపిటల్ కోసం తీసుకున్న బ్యాంక్ రుణాలు వార్షిక వృద్ధిని చూపలేవు. డెట్ మార్కెట్ సంభావ్య పెట్టుబడుల గురించి చెబుతుంది. కానీ, ప్రస్తుతానికి ఈ ఫ్రంట్‌లో కూడా ఏమీ మంచిది కాదు.జీడీపీ అంచనాల్ని మించి నమోదవగా.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సామర్థ్యానికి జీడీపీ గణాంకాలు నిదర్శనం అని ట్విట్టర్ (X) వేదికగా పోస్ట్ చేశారు. ‘తాజాగా జీడీపీ గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలం, సామర్థ్యా్న్ని ప్రతిబింబిస్తున్నాయి. వేగవంతమైన వృద్ధికి, 140 కోట్ల మంది భారతీయులు అత్యుత్తమ జీవనం గడిపేందుకు, వికసిత భారత్‌ను సృష్టించేందుకు ప్రభుత్వం తన చర్యల్ని కొనసాగిస్తుంది.’ అని అన్నారు మోదీ.