సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు కొత్త కాలనీలోని ప్రార్థన సంఘం కు చెందిన బేతేల్ అపోస్తులు చర్చ్ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ బోధనలు అందరికీ చాటి చెప్పి అందర్నీ సన్మార్గంలో నడిపేందుకే ఈ సంఘం పనిచేస్తుందని నిర్వాహకులు రెవరెండ్ కే సామ్యూల్ పాల్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో క్రీస్తు కీర్తిని మరింత విస్తృతంగా చాటి చెబుతామని అన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు బి రాజేష్, సంఘ సేవకులు విశ్వాసులు భారీగా హాజరయ్యారు.