Someshwar:అభిమాని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే

సిరాన్యూస్‌,బోథ్‌
అభిమాని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలోని కౌట బి గ్రామానికి చెందిన వెండి సోమేశ్వర్ అనే యువకుని ఇంటికి బుధవారం బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, బి ఆర్ ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ లు వ‌చ్చారు.  ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బి ఆర్ ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు జాన్సన్ నాయకులను అభిమానంతో ఇంటికి స్వాగతించారు. అభిమాని వచ్చిన నాయకులను శాలువాతో సన్మానించారు. ఏది ఏమైనా అభిమాని పిలవగానే అభిమానంతో ఇంటికి రావడంతో అభిమాని సోమేశ్వర్ ఆనందపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *